పుట:Abraham Lincoln (Telugu).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తరంగముల నోలలాడుచుండిన జను లెల్లరును నగాధశోక కర్దమాంబుధి మునింగి లేవకుండిరి. ఇట్లుండ జిచ్చునకు గాలి తోడ్పడినతెఱంగున లింకను కార్యదర్శి సీవార్డు చంపబడెనని తెలియనాయెను. లోకుల ఖేదభయంబులు దెల్ప నుక్తులుచాలవు. ఎచ్చట జూచినను హత్యల వార్తయె మెండయ్యెను. రాజ్య మరాజక మగు ననియు గొప్ప యుద్యోగస్థు లెల్లరును బ్రాణము లర్పింప సిద్ధపడవలె ననియు వదంతి గలిగెను.

'బూతు' మొదలుగా గల్గు కొందఱు దుర్మార్గులు దాస్యవ్యాపార పక్షపాతు లొక సంఘముగ జేరి రాజకీ యోద్యోగస్థుల దుదముట్టింప దీర్మానించి యుండిరి. లింకనును మార్చి 4 వ తేదీననె సంహరింప బ్రయత్నించిరి. గాని వారి పన్నుగడలు జయమందలేదు. కాన తమ మనోరథము నిపుడు తీర్చికొనిరి. సేనానాయకుడు పనివడి పిలడెల్ఫియాకు వెడలి యుండె గాన దప్పించుకొనియెను. లేకున్న లింకనుతో నతడును దివికేగియుండును.

రాజ్యాధికారు లీ దుర్మార్గులవెదకిపట్టిరి. బూతును అతని స్నేహితులును దాము చేసిన కార్యములకు ఫలముగ గుండు దెబ్బలు దిని పరలోకప్రాప్తి జెందిరి.