పుట:Abraham Lincoln (Telugu).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధించుచు నుత్తరము వచ్చిచేరెను. లింకను నద్దానికి సమ్మతించి జాగ్రత్తగ నుండెను.

నాడ ప్రథమజయపు నాలుగువ సంవత్సరోత్సవదినము. నాడ రిపులచే జిక్కియుండిన సంయోగరాష్ట్రపు ధ్వజము గోటపై కెక్కింప నియమిత మయియుండెను. ఈ రెండుత్సవములును మహాసంతసమున జరుపబడెను. ప్రతిగ్రామమునుండియు రాజభక్తు లనేకులు గుంపులుగుంపులుగ విచ్చేసి సంపూర్ణ హృదయమున నుపన్యాసములు విని, మంగళవాద్యముల కలరి, మిక్కిలి సంతుష్టహృదయ లయి యుండిరి.

ఇంకను దమ యాహ్లాదమును వెల్లడిసేయ నాటిరాత్రి మహావైభవమున గడప నిశ్చయించి నాటకాదివినోదముల కేర్పాటులు గావించిరి. అం దొక గొప్పనాటక శాలయందలి ప్రదర్శనము వీక్షింప రాష్ట్రపు నుద్యోగస్థుల బ్రాముఖ్యు లెల్లరును నాహూయమాను లైరి. లింకను మొదలుగ నందఱు నచటికి దఱలుదురని వార్తాపత్రికలు ఘోషించెను.

నిశాసమయమున నెనిమిదిగంటలమీద నలుబదినిమిషములకు లింకను దనభార్యతోను గొప్ప యుద్యోగస్థులతోను నాటకశాలం బ్రవేశించెను. ఆ మహనీయుని రాక కచ్చటిజనులుప్పొంగి కరాస్ఫాలనంబున జయజయారావంబుల నతనికి స్వాగత మిచ్చుచు గారవముసూప లేచి నిలిచిరి. అతడు