పుట:Abraham Lincoln (Telugu).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చినదాదిగ దన్ను బ్రాణములు గొందుమని జంకించుచు వైరులు వ్రాయుచువచ్చిన పత్రము లనేకము లత డందు కొనుచుండెను. అయిన నవి దనకు బ్రారంభమున గొంచె మార్తి గలుగ జేసినను రానురాను సర్వసాధారణ మగుటవలన నలయింప లేకుండెనట. ఏమివింత? ప్రాణాపాయసూచనలు గూడ సాధారణము లగునే?

ఇతరాధికారులు పలుమాఱు లింకను సంరక్షణార్థము గొంతదండు నతనిగృహముచుట్టు నుంచుటకును నాతనివెంబడి పంపుటకును బ్రయత్నించిరి. దాని కత డంగీకరింపకుండెను. అట్లు చేయుటవలన లాభ మొక్కటియు లేదనియు దుర్మార్గుల కవనమ్మకముం గనుపఱచి వారి కోపానలంబు నింక నెక్కుడు చేయువిధం బగుననియు, దన్ను సంహరింప నిశ్చ యించిన వారి కెన్నియో మార్గములు గలవనియు, వానినెల్ల నాపుటకు బ్రయత్నించుట రాజ్యాంగపు బనిని నిల్పుటయే యనియు, నట్టియుద్యమముల ఖండించుచు వచ్చెను.

1865 వ సంవత్సరము 14 తేది ప్రాత:కాలమున లింకను కుమారుడు సేనానాయకుల నొక్కడు లీ పట్టువడిన తెఱం గెఱింగింప నేతెంచెను. అతనితోడన జనరిల్లాల నను స్నేహితునివద్దనుండి లింకనుకు రిచ్మండుపట్టణము జొచ్చినరీతి మరల సాహసించి దనప్రాణముల నపాయస్థితియం దిడుకొనగూడదని