పుట:Abraham Lincoln (Telugu).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జితుడయి రాజ్యాంగపు దండుకు జిక్కెనను వార్త దేశముపై బర్వి యాహ్లాదముం బదిరెట్లు హెచ్చించెను.

యుద్ధము పరిసమాప్తి నొందెను. స్వాతంత్ర్యము జయ మందెను. వాషింగ్టనుపురపు రాజ్యభవనమున

"దైవమునందును, జనులయందును, రాజ్యాంగమునందును నమ్మక ముంచుటచే నీసంయోగము నిలచిన దని" యొక చోటను,

"ఈశ్వరు డీవిధమున నొనర్చియున్నాడు. అతని కృత్యములు మహాద్భుతములని" రెండవపట్టునను లిఖించి యచ్చోటుల జయధ్వజము లెత్తిరి. అమెరికాకు మహోత్సవ కాలమిదె యేతెంచెను.

ఆనందకరం బగు నెమ్మదిసమయము ప్రాప్తించెననువార్త విద్యుల్లతాగమనంబున దేశమంతట వ్యాపించెను; సముద్ర మధ్యమున బఱచి దేశ దేశములకుం జేరి స్వాతంత్ర్యంబు జయమొందె ననిచాటి జనులెల్లర హర్ష వీచికల దేల్చెను.

యునైటెడ్ స్టేట్సు రాష్ట్రపు బ్రజలు గనుపఱచిన సంతోషమునకు మేరయే లేదు. లీ పట్టువడెననువార్త చెవి సోకినంతనె యనేకు లనేకవిధముల దమ ముదమును వెల్లడించిరి. కొందఱు దేవాలయములందలి (అనగా చర్చీలయందలి) గంటల మ్రోయించిరి; కొందఱు ఫిరంగుల బేల్చిరి;