పుట:Abraham Lincoln (Telugu).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందఱు తమతమ స్నేహితుల గౌగిలించిరి; కొమ ఱశ్రువులు రాల్చిరి; మఱికొందఱు నవ్వనారంభించిరి; అందఱు దమతమ రీతి సంతసంబును వెలిబుచ్చిరి. ఇప్పట్టున నమెరికాయందు దమ యారావములచే నింగిముంచు సంఖ్యాతీతము లగు గంట మ్రోగుడులును, దమ గంభీరధ్వానములచే దిశ లవియజేయు ఫిరంగిమొత్తముల యుద్రేకములును, దమ యల్ల కల్లోలముచే బరాజితశత్రువుల గల గుండువడ జేయు జయనినదములును, సంతోష తరంగముల విచ్చలవిడి వాయుమండలమున బ్రసరింపజేయు మంగళ వాద్యములును, దాస్యాంధకారము వాపి యిదె స్వాతంత్ర్యభానుండు వెడలెను. గనుడని ప్రకటించు జ్యోతులయు బాణసంచులయు వెలుంగులును, మిక్కుటముగ బిక్క టిలి యంతటి సుదినము లాదేశము నకట మున్నెపుడును గలుగలేదనుట ననూన మార్గంబున నగుపఱచెను.

లింకను దా దన పరిపాలనమున జేయ సమకట్టిన మహాకార్యము నెరవేర్చెను. తిరుగుబాటును మొదలంటి నశింప జేసి సంయోగము నుద్ధరించెను. అమెరికనులును వారి పరిపాలకులును నొక్కరు దప్పక యెల్లరును నతనిని గొనియాడుచు దమచే నగు విధమున గృతజ్ఞత సూపుచున్నారు. * ఎప్పుడును నతనిని యునైటెడ్ రాష్ట్రపు దండ్రియగు ______________________________________________________________

  • మొన్న మొన్న (ననగా 1903 వ సంవత్సర ప్రాంతముల) లింకను