పుట:Abraham Lincoln (Telugu).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లింకనును భయమున డాయుచుండిరి. అత డదిగుర్తెఱిగి చిఱునగవుతో వారిం జేరి చేయిచ్చెను. అంత వారిహర్షంబునకు మితిలేకపోయె. కొందఱు వెఱ్ఱిగ నవ్వసాగిరి. మఱి కొంద ఱేడ్వసాగిరి. అనేకులు గొంత నవ్వుచు గొంత యేడ్చు చుండిరి. అందఱును "తండ్రీ లింకను! దేవుడు నీన్నెప్పుడు గాపాడుగాత. నీ కెప్పుడు సుఖంబు లొడగూర్చుగాత" మని పలువిధముల దీవింప దొడగిరి.

ఇట్లు లింకనునకు నీగ్రోలు గనుపఱచిన గౌరవ మంతింత యని వర్ణింపనేరము. వర్ణించుటయు ననవసరము. అనేకులతని జూచిన సంతోష మను మహాసముద్రమున మునిగి యొడలెఱుగక హర్షాశ్రువులు రాల్చుచుందురు. కొంద ఱాతని దీవించుటయంద తమకాలమెల్ల బుత్తురు. అందఱును నతని దమ విమోచనకారు డని దైవముం బోలె దమతమ యిండ్ల బూజించుచుందురు.

లోకమున బూర్వపద్ధతులెల్ల నశించి బూర్వపు రాజ్యములెల్ల దారుమారై, ప్రజాపరిపాలనంబె న్యాయపరిపాలనంబని నెగడి, సర్వజనులు స్వాతంత్ర్య రాజ్యముల సుఖంబు డునప్పటికి గూడ నమెరికాయందలి యే మార్పులు దృష్టిపథంబు నుండి దొలగిపోయినను, లింకను దేశాధ్యక్షతయందలి యే యుద్ధము లేకార్యము లేసంస్కరణములు మనుష్యుల మన