పుట:Abraham Lincoln (Telugu).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంపెను.శత్రు లద్దానిబట్టి యాపివేసిరి. ఈవిషయము లింక నెంతస్నేహముగోరి కలహమునకు గారణ మొసంగ నయిచ్ఛ గలవాడో విశదము సేయుచున్నది.

తమ శక్తికొలది బోరాడి ఫలముగానక యా పట్టణపు సేన శత్రువులకు బదుమూడవ తేది లోబడియెను.

ఇట్లు దక్షిణమునందలి బద్ధసీమలు రాజ్యాంగముపై దాడివెడలుట సిద్ధమాయెను. రాజ్యాధికారు లవలంబింపవలసిన మార్గమును వార తెలియ జేసిరి. ఎట్లయినను బ్రయత్నించి యల్లకల్లోలములనడుగంట జేసి బద్ధసీమల బరాజితుల జేసి తీరవలెననుట విశద మాయెను. దానికి యుద్ధముదక్క వేరొండుపాయము లేకుండుటయు బయల్పడెను. అందువలననే లింకను డెబ్బదియైదువేల సైనికుల నియమింప నిశ్చయించెను. నాటినుండి యతడు శత్రువుల నడంపదగు నుపకరణముల సేకరించుట యందును సేనావిషయముల నెఱింగికొనుట యందును మగ్ను డయ్యెను. అన్నివిషయముల నందఱి యభిప్రాయముల విని తనపభిప్రాయముల మార్చుకొనుచుండినను లింక నితరులకు భయపడి తాను మంచిదని నమ్మినది వదలువాడు గాడు.

దక్షిణసీమలయందలి బానిసలకు నాయుధములిచ్చి వారిసాయము గొనినయెడల లెస్స యని యొక కార్యదర్శి వ్రాసెను.