పుట:Abraham Lincoln (Telugu).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకరము పూనుటయు దగదు. తామస మొక్కతఱి మనల లోబఱచుకొనినను నీ యనురాగబంధముల ద్రుంప నీయ గూడదు. అనేకయుద్ధరంగములనుండియు, ననేక దేశభుక్తుల సమాధులనుండియు నీదేశములోని ప్రతిమనుష్యుని హృదయ కమలమువఱకును బ్రతిమందిరమునందలి సభాస్థానము వఱకును వ్యాపించియుండు గుప్తస్మరణతంత్రీస్పర్శంబున మన సాత్విక గుణరాజంబుల ప్రదర్శంబునకంటె నెక్కుడుగ సంయోగకీర్తనాస్వనము ప్రబలజేయ గల్గుదుముగాక!"

నాటి ప్రాత:కాలమున లింకను దన ప్రథమోపన్యాసము నింట భార్యాదులకు జదివి వినిపించి తన్నొక్కటిగ విడిచిపొండనివేడెను. కవాట మట్లె తెఱచియుండిరి. అతడు దన్ను దనపుత్రకళత్రంబుల దనదేశంబును సర్వేశ్వరున కప్పగించుకొని యాతని దయామయత్వంబు దమనెల్ల సంరక్షించును గాత యని భక్తిరసానుగుణస్వనమున బ్రార్థించుచుంట యాతని మిత్రులెల్ల వినిరి. అతనిపై నిడబడిన భారము మానవశక్తికి మించి దైవసాహాయ్యములేక మోయ నలవి గాకుండెను.

లింకనునకు బూర్వ ముండిన రాజకీయోద్యోగస్థులు దక్షిణసీమలవారై రాజ్యమును మహా హీనపదవికి దెచ్చి యుండిరి. అంతర్యుద్ధమున కెన్ని మార్గములు వలయునో యన్ని మార్గము లేర్పఱచి యుండిరి. బొక్కసమున నొక్క కాసై