పుట:Abraham Lincoln (Telugu).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నను లేకుండ జేయుటయె గాక రాజ్యాంగమునందలి నమ్మకమును జెఱచి యప్పు పుట్టించుకొనుటయె దుస్సాధ్యము జేసి యుండిరి. దొరకిన ద్రవ్యమున విశేషభాగమును లంచములిచ్చి యల్లకల్లోలమునకు జనుల రేపజూచిరనియు బ్రవాద మొకటి యుండెను. ఉత్తరసీమల యందలి గిడ్డంగులలోని మందు మొదలగు యుద్ధోపకరణముల నన్నింటిని దక్షిణసీమల ముఖ్యస్థానముల కనిపి వాని బలపఱచి యుత్తరసీమల నిరాధారముల జేసియుంచిరి. ఇక నౌకాసేన గతి జూతురేని దొంబది యుద్ధ నావ లుండుటకు మారుగ లింకను దేశాధ్యక్షత పూనునప్పటికి రెండుమాత్రమ సిద్ధముగ రాజ్యవహుల కక్కరకు వచ్చునట్లుండెను. ఇట్టి తరుణమున దక్షిణసీమలు దిరుగబడిన రాజ్యాంగమునకు బరాజయము తప్పక గలుగునటుల నుండెను.

లింకను దేశాధ్యక్షత వహించినవెంటనె సీమప్రతినిధి యొక్క డతని కీ విషయముల విశదీకరించి యునైటెడ్ స్టేట్స్ సంయుక్త రాష్ట్రపు దండ్రి యగు వాషింగ్టను సేనానాయకత్వమున కియ్యకొనినపు డెంత కఠినకాలముగ నుండునో యప్పుడు నంత కఠినకాలంబ యనియు నతని కెంతసాధన సూన్యత గల్గెనో లింకనున కంత సాధన సూన్యతగల దనియు జింతాసూచనముగ బల్కెను. దానికి బ్రత్యుత్తరముగ లింకను,

"మీరు జెప్పునది గొంత నిజమ. అయిన వాషింగ్టనున కంటె నాకు బరికరము లెక్కుడు గలవు. రాజ్యహితులగు