పుట:Abraham Lincoln (Telugu).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూతముగదా" యనుచు వెడలి తన కఱ్ఱం దెచ్చి "ఎవ్వరు పొడవైనది చూతము రమ్మ"ని జాగ్రత్తగ నా పిల్లవాని పొడగు లెక్కించి తనపొడవును లెక్కింపజేసి యిద్ద ఱొక్కటె పొడుగగుట గాంచి,

"అవును నిజమ. మే మిరువుర మొక్కటియ. అత డీవిషయమును సూక్ష్మముగ గ్రహించె" నని పొట్టిబాలునకు జెప్పి వారి తగవుదీఇర్చి మంచిమాటలతో వారిని బుజ్జగించి పంపివేసెను.

ఘనత ఘనత యని మౌఢ్యముపూని యజ్ఞానులపై మండిపడెడు మహానుభావు లీ లింకను నడత గమనింతురు గాక!

అతడు న్యాయవాదిగ నున్నప్పుడు తన భ్రమణముల నొకానొక ముసలాపె యింట భుజించుచుండును. ఆమె యతని దర్శింప నేతెంచెను. కొన్నివిషయములను స్మరింపజేసినతరువాత నామెను గుర్తించి సంతసమున స్వాగతమిచ్చి కుశల ప్రశ్న లడిగెను. అందుమీద నామె,

"నాడు మీ కేనుబెట్టిన బీదయుపభోజనము జ్ఞప్తియం దున్నదా?" యనెను.

"లేదు. మీయింట నే నెప్పుడును భోజనమున లోపమనుభవింప లేదు."