పుట:Abraham Lincoln (Telugu).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల గణింపక యతనినె విశ్వసించి యతనినే బహుకార్యస్థానముల కేర్పఱచుచు వచ్చిరి.

అతని యౌన్నత్యమునకు గారణభూతము లైనవిషయములు గొన్నికలవు. బానిసవ్యాపారనిర్మూలనంబుకై యతడు దన శక్తి నంతయు నుపయోగించి పాటుపడెను. అతని వాక్ఛక్తియు వాదమహిమయు బ్రతిమనుజుని సత్స్వభావంబును క్షణక్షణ ప్రవర్థమానపటుత్వముతో గొల్లగొని యాశాపాశబద్ధులై న్యాయచింతనకు బహుదూరు లగు ప్రతిపక్షము వారిని బానిస వ్యాపారమం దుత్సాహులమాత్ర మంతకంతకు గనలజేసెను. గొప్పగొప్ప సభల వైరు లతని బీదపుట్టుక నుపన్యసించి హేళనము సేయుటగూడ దటస్థించెను. అయిన నది యతని కవమానకారి గాక వారి నీచత్వమునే వెల్లడిచేసెను. ఏనుగుం జూచి కుక్క లఱచిన నేరికి లోకువ యను లోకోక్తి వృథ యగునే?

లింకను దుష్టసమరము నొకదానిని నివారింప మిక్కిలి పాటుపడియెను. అయ్యది భానిసవ్యాపార వృద్ధికై యొకానొక సీమను లో బఱచుకొన జరపబడియెను. 'ఘోర కర్మలచే నిండియున్న యిట్టి దేశ మెన్నడైన నొకదినము దేవుని యాగ్రహ మనెడి యనలమున బడి భస్మము గాగలదు. దాస్యము ప్రబల జేయుటకొఱ కొకసీమను నిర్బంధిచుట