పుట:Abraham Lincoln (Telugu).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములవెల నింకను తగ్గింపగలము. చందాదారులు కానివారికి మాగ్రంథములు, అంచెకూలిగాక నూఱుపుటలకు ర్పు. 0-6-0 చొప్పున నియ్యబడును.

మామండలిలోని సభాసదులందఱును బ్రస్తుతము ప్రతిఫల మేమియు గోరకయే యీపనికి బూనియున్నారు. ఇంతియకాదు; నష్టమువచ్చినను గొంతవఱకు భరించుటకు మాలోని గొందఱు సిద్ధముగ నున్నారు. అయినను నాంధ్రవాచకప్రపంచముయొక్క (Telugu Reading Public) సహాయము లేనిదే యిట్టిప్రయత్నములు కొనసాగనేరవు.

తెలుగుసీమలోని జమీదారులును, ఇతర లక్ష్మీపుత్రులును ఇట్టికార్యముల నవలంబించినవారికి ధనరూపమైన కేలూత యొసగి, రాజనరేంద్ర మనుమసిద్ధి కృష్ణరాయలచరిత్రమహిమ యిన్నివందలసంవత్సరములవఱకు గూడ నాంధ్రదేశంబున నున్నదని వెల్లడి చేయుదురు గాక. ఇది ధనాధికులకు గర్తవ్యము.

ఇక విద్యాధికులు మాకును మావలె గ్రంథంబుల బ్రచురించు నితరులకును మూడుతెరంగుల సాయ మొనర్పవలెను. గ్రథంబుల వ్రాయుటయు, నితరులు వ్రాసినగ్రంథంబుల గొనుటయు, నాగ్రంథంబులలోని విషయముల జనసామాన్యమునకు దెల్పుటయు. ఇది యింగ్లీషు నేర్చినవారు మాకు జేయవలసిన త్రివిధసహాయము. ఇందు మొదటిది గ్రంథనిర్మాణంబు. ప్రకృతి శాస్త్రములు మొదలయినవి యింగ్లీషు నేర్చిన విద్వాంసులే వ్రాయవలయును. ఇందునగుఱించి రావుబహదరు కందుకూరి వీరేశలింగముపంతులుగారొకచోట నిట్లు వ్రాయుచున్నారు:-

"ఇట్టిపుస్తకములను రచించుట యింగ్లీషునందు మంచిపాండిత్యము గలిగి బహుశ్రుతు లయి సంస్కృతాంధ్రభాషలయందు తగినంతజ్ఞానము కలవారికే సాధ్యమగును గాని కేవలసంస్కృతపండితులకును కేవలాంధ్రపండితులకును సాధ్యము కాదు. కాబట్టి యీపనిని నిర్వహించి దేశభాష