పుట:Abraham Lincoln (Telugu).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందఱు మిత్రుల సూచన ననుసరించి, చరిత్రానుసారు (Historical) లగు కల్పితకథల (Novels) నెవ్వరైన వ్రాసిరేని వానిని బ్రచురింప నియ్య కొంటిమి. మాకార్యక్రమమునకు మే మీయెల్ల లేర్పఱచుకున్నారము.

మొట్టమొదట మేము 'విజ్ఞానచంద్రిక' యనుమాసపత్రిక నొకదానిని బ్రారంభించి యందు నీగ్రంథంబుల బ్రచురపఱుప దలచితిమి. కాని నాలు గసంపూర్ణగ్రంథంబులు నెలనెలకు దునుకలుతునుకలుగా సంవత్సరమంతయు నిచ్చుచుండుటకంటె నొక్కొక్కతఱి నొక్కొక్క సంపూర్ణగ్రంథంబు చదువరుల కిచ్చుట మేలని పిదప నిశ్చయించితిమి. 'విజ్ఞానచంద్రికా గ్రంథమాల' యను పేరిట సంవత్సరమునకు మొత్తముమీద నెనిమిదివందలపుటలకు మించకుండ నాలుగుగ్రంథంబుల బ్రచురింపగలము. ఈ గ్రంథములను నెవ్వరును ముందు చందా యియ్యనక్కఱలేదు. గ్రంథము సిద్ధముకాగానే యది మాచందాదారులకు వాల్యూపేబిల్ ద్వారా పంపగలము. 'విజ్ఞానచంద్రికామండలి' వారు ప్రచురించెడు గ్రంథములకు జందాదారుడ నగుదు ననియు, గ్రంథములు సిద్ధమగునప్పుడెల్ల దనపేర నాగ్రంథములు వ్యాల్యూపేబిల్ ద్వారా పంపవలసిన దనియు, 'మండలి' కార్యదర్శియగు మ.రా.రాశ్రీ, రావిచెట్టి-రంగారావుగారు, రెసిడెన్‌సీ, బాజారు, హైదరాబాద్ (డెక్కన్) పేర వ్రాసిన జాలును. ఇట్లు వ్రాసిన వారిపేళ్లు మాచందాదారులపట్టికలో జేర్చికొందుము. ఇట్టి చందాదారులకు మే మచ్చువేయుగ్రంథంబు లన్నియు బహుస్వల్పమైన వెలకు నియ్యదలచితిమి. శ్రేష్ఠమైన (Superior) నున్నవి (Glazed) కాగితముమీద నచ్చువేసినగ్రంథము, లంచెకూలి మొదలయినవీ మేమే భరించి, నూఱు పుటలకు ర్పు. 0-4-0 చొప్పున నిచ్చెదము. అనగా నొకగ్రంథము నూఱు పుటలే యగునేని యందు కగు నంచెకూలి ర్పు 0-0-6 వ్యాల్యూపేబిల్ కర్చు ర్పు. 0-1-0 పోగా మిగిలిన ర్పు. 0-2-6 మాత్రము పుస్తకభృతి యగును. పదునైదువందల శాశ్వతపుచందాదారులు సమకూరుదురేని గ్రంథ