పుట:Abraham Lincoln (Telugu).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నని కొందఱు పరిహసించిరి. మఱికొందఱు లింకనకు వ్యతిరిక్తముగ నిలచుట కితనికి బుద్ధిమాంద్యము గాదా యని పలికిరి.

ఇట్లు సమ్మతులవలన నాయకుడుగ నేమింపబడిన లింక నుపన్యాస మియ్యవలసినదని యతని శిష్యులు వేడిరి. దానికి బ్రత్యుత్తరముగ దనకు వారు చూపిన గారవమునకు వారికి వందనము లాచరింపుచు నమ్రతతో దనశక్తికొలదిదా దనధర్మముల దీర్ప నుద్యుక్తు డై యున్నవాడ నని నుడివెను.

ఈ పటాలము బహుకాలము నిలువలేదు. ఈ యుద్ధ భటులును విశేష కార్య మొక్కటియు జేయలేదు. ముప్పది దినములు వీరు పనిసేయవలసినదిగ నేమింపబడి యుండెను. ఆ స్వల్పకాలమున జరగిన సంగతులలో నొకటి విస్తరింపదగినది.

ఒకనాడు 'ఎఱ్ఱ యిందియ' ను డొకడు వడవడంకు ముదుసలి యీ దండు విడిది ప్రవేశించి తా వారి మైత్రి గోరి వచ్చినవాడ నని నుడువుచు శరణ మడిగెను.

"మే మిందియనుల బరిమార్ప వచ్చితి"మని యొక డఱచెను.

"నీకు దయగాదు; సీసపుగుండే గతి యగు న"ని మఱి యొకడు గద్దించె.

"చంపుడు, చంప డ"ని యనేకులు కేక లిడిరి.