పుట:Abraham Lincoln (Telugu).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బట్టిగుంజుదురు. ముఖమున బొగాకునీరు జల్లుదురు. ఇవన్నియు నోర్చుకొనిన నేటికి గొనిపోయి ముంచుదురు; లేకున్న ననేకు లొక్కరీతి గాలుసేతుల దన్ని గ్రామము వెడల జేతురు. అతడు దమలో నొకరితో బెనగ నియ్యకొనియెనా యన్యాయపుబోకల బోయి యతని వేధింతురు. దానికి వెనుదీయక వారి నోడించెనా వాని దమవానిగ జేకొందురు.

ఇట్టి యిక్కట్టులు లింకనుకు బ్రథమమున దటస్థింప వయ్యెను. అతనిశక్తిని నానకట్టమీద జూచినవా రగుటనో యాపుట్టు పల్కు లాలకించి జడిసినవా రగుటనో యా దుర్మార్గులు లింకనును జెనకకుండిరి. అయిన నొకనాడు వారిలో నొకడగు బిల్లి యనువానికిని ఆపుట్టునకును సంవాదము గలిగి యొకరినొకరు దూషించుకొని తమతమ మల్లుల యదు రొడ్డిరి. బిల్లి తమజాకుతో లింకను పోరవలెనని కోరెను. లింకను సమ్మతింపడాయెను. అందుపైని నాదుష్టులు లింకను ముక్కుబట్టి గుంజి యతని నవమానపఱచిరి. అతడు వారిని హెచ్చరించెను. వా రది లెక్కకు గొనక నతని నలయించిరి. తుట్టతుద కతడు జాకుతో మల్లయుద్ధమున కంగీకరింపవలసి వచ్చెను. ఎన్ని మాయోపాయములు సేసినను లింకను జయమున కడ్డు లేకపోయెను. జాకు నోడించి చక్కగ జే జాచి వాని మెడబట్టి పై కెత్తి నిలుపుట గాంచి యాదుష్టు లతని శరణు