పుట:Abraham Lincoln (Telugu).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరకినను దానిన వల్లించుచుండెను. పని తొందరలేనపుడు దుకాణపు బల్లపై బరుండి చదువుచుండును. కొన్ని వేళల నంగడిముందఱి చెట్లనీడన బరుండి పఠించుచుండును. మఱి కొన్ని వేళలల గ్రామము వెలువడిపోయి యేరికి నెఱుకరాని యేకాంతస్థలమున గూర్చుండి పరిశ్రమ సేయుచుండును. రాత్రివేళల జాలసేపు మేలుకొనియుండి పీపాలు సేయువాని కుంపటిలో నచటి చెత్తవైచి దానివెలుగున జదువుచుండును.

తెలియని విషయముల గ్రేహము నడిగి తెలిసికొనును. విద్యాపారీణు లనిపించుకొని యా పట్టణము సొచ్చినవారంద ఱతనిచే బ్రశ్నింపబడకపోవుటలేదు.

ఇట్లెంతో పాటుపడి లింకను వ్యాకరణమునందు ప్రౌఢిమ గాంచెను. ఇతర విద్యల బ్రవీణత వడసెను. ముందు కతని కత్యంత సహకారు లగుసాధనము లన్నిటి నతడు దైవికాజ్ఞానుసారముగ నాయత్తపఱచుకొనుచుండెను. ఇట మఱియొక విషయము గూడ నుడువవలసియున్నది.

న్యూసేలముపట్టణములోనికి గ్రొత్తవా డెవడు వచ్చిన నతని బలుకష్టముల బెట్టు దుర్మార్గులసంఘ మొకటి యచ్చట నుండెను. వారు నూతనాగతుండు గాన్పించినతోడనె యతనిని బరుగెత్తుట, కుస్తీ, మొదలగుపందెములకు బిలుతురు. అత డందుల కంగీరింపకున్న బలువిధముల నవమానపఱతురు. ముక్కు