పుట:Abraham Lincoln (Telugu).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రులకై పనిసేసి యుండనోపడు. తండ్రి కతడ పెద్దకుమారుడు. ప్రయాణములాకాలమున మిక్కిలి ప్రయాసకారులు. అనేక విషయముల నపాయకారులను. నూతన గృహనిర్మాణమును కష్టతమంబె. కాన దన మాతాపితరులు, తన యక్క సెల్లెండ్రు, తనవా రెల్లరు సురక్షితముగ 'నిల్లినాయి' సేరి యచట కాపురము గుదురువఱకు వారివెంట నుండుట కతడు గర్తవ్యముగ జేకొనెను.

ఇట్లు నిర్ధారణ చేసికొని వెడలి యెట్టికష్టము లెట్టియాపదలు దమ్మెదిరించినను సరకుచేయక దమవారికెల్ల ప్రోత్సాహ మొసగుచు బహుదినములు ప్రయాణముసేసి నూతననివాస ప్రదేశము జేరిరి.

అచట నొక కొయ్యగుడిసె ఆబ్రహాము దాన పూని నిర్మించియిచ్చెను. లింకనులు నివసించిన గుడిసెలలో నిదియ యుత్తమము.

తరువాత నితడు దన మఱదియగు జాన్ సాయము గొని పదునై దెకరములభూమి దున్ని కంచెవేసి సిద్ధము చేసి యుంచెను.

ఆ శీతకాలమున నెప్పుడును మూడడుగుల దట్టముగ మంచు గప్పియుండెను. ఆబ్రహాముయొక్క పట్టుదలయు సామర్థ్యంబును దోడుపడకుండిన లింకనుల కనేకసౌఖ్యములు గల