పుట:Abraham Lincoln (Telugu).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనివై యుండుననుటకు సందియములేదు. అంతచలియం దతడు దుపాకి మోసుకొని వేటకు బోయి భోజనమునకు బలలముదెచ్చి పెట్టుచుండును. పంటలేమియు బండజాలని యా ఋతువుల నీ 'మార్గదర్శికు' లింతకంటె వేఱుమార్గము గానలేరు గదా!

ఇంట నింతపని సేయుచు నాబ్రహాము బయట జీతమునకు గుదిరి యజమానుల సంతృప్తిపఱచుచుండును. విద్యాభివృద్ధికి బాటుపడుటయు మానడయ్యెను. ఈ యంశమునకు దృష్టాంత మిదె. బ్రౌనుసతి యాబ్రహాము లింకను మరణానంతరము నొడివిన మాటల వినుడి:

"లింకనును నే నెఱుగుదును. మా ముసలాయనకై యతడు పనిసేయుచుండును. మాపొరుగుననె యతడు నివసించుచుండును. ఆకాలమున బాటసారులకు మార్గముల విశ్రమించుటకు సత్రము లుండలేదు. అందువలన వా రెవ్వరైన యిల్లుగలవారి సత్కారములకు లోనై యుందురు. ఒక సాయంకాలమున దరుణవయస్కు డొక్కరుడు మాకంచెయొద్ద గుఱ్ఱము నాపి మా ముసలాయనను రాత్రి విశ్రమింప స్థల మిచ్చెదరే యని వేడెను. దాని కతడ "మీ పశువునకును మీకును నాకలి దీర్ప గల్గుదును. మీకు బరుండుటకుమాత్రము నాసేవకుని ప్రక్క దక్క స్థలము లేదు. మీ యిచ్చ