29. సూచన:—
| హస్తాభియోగచలనాత్కిఞ్చిన్ముకుళితాకృతిః. | 156 |
| సూచనాదృష్టిరాఖ్యాతా సూచనాదిషుయుజ్యతే, | |
తా. చేసైగ ననుసరించి కొంచెము మూయఁబడిన కన్నులుగలది సూచనాదృష్టి యనఁబడును. ఇది జాడ చూపుట మొదలైనవానియందు చెల్లును.
30. లజ్జిత:—
| పతితోర్ధ్వ పుటావ్రీడా భరతఃచ్యుతతారకా. | 157 |
| కిఞ్చిత్కుఞ్చిత పక్ష్మాగ్రా లజ్జితా లజ్జితాదిషు, | |
తా. వాలిన మీఁదిరెప్పలును, సిగ్గువలన వాల్పఁబడిన నల్లగ్రుడ్లును, కొంచెము ముడిగిన రెప్పలకొనలును గలది లజ్జితదృష్టి యనఁబడును. ఈదృష్టి సిగ్గుపడుట మొదలైనవానియందు వినియోగించును.
31. మలినము:—
| మలినాంతా చలత్పక్ష్మా కిఞ్చిన్ముకుళితాకృతిః. | 158 |
| అక్షిభ్యాం కృష్ణతారాదృఙ్మలినా దృశ్యతే స్త్రియామ్, | |
తా. సంకోచించిన కనుగొనలును, చంచలములైన రెప్పలును గలిగి కొంచెము ముడిగి కన్నులచే ఆకర్షింపఁబడిన నల్లగ్రుడ్లు గలది మలినదృష్టి యనఁబడును. ఇది స్త్రీయందు గనుపడును.
32. త్రస్తము:—
| అంతర్వికసితా పూర్వం పశ్చాద్విరళతారకా. | 159 |
| త్రస్తాత్రాసేమదేదృష్టి స్సమోద్వృత్త పుటద్వయా, | |
తా. తొలుత వికాసముగలదై పిమ్మట చలించుచున్న నల్లగ్రుడ్లతో