పుట:Abhinaya darpanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా. రసభావములు లేక తాళలయాశ్రయమై యుండునది నృత్తము.

రసభావవ్యంజకాదియుతం నృత్యమితీర్యతే. 11

తా. నృత్యమనఁగా రసము, భావము మొదలగువానితోఁ గూడియుండునది.

ఏతత్త్రయం ద్విథా భిన్నం లాస్యతాణ్డవసంజ్ఞకమ్‌,

తా. ఈనాట్య నృత్త నృత్యములు మూఁడును మరల లాస్యమనియు, తాండవమనియు రెండు విధములుగా విభజింపఁబడియున్నవి.

సుకుమారం తు తల్లాస్య ముద్ధతం తాణ్డవం విదుః 12

తా. సుకుమార మగునది లాస్యమును, ఉద్ధతమగునది తాండవమును నని చెప్పుదురు.

దృష్టవ్యే నాట్యనృత్యే చ పర్వకాలే విశేషతః,

తా. నాట్యనృత్యములు రెండును పర్వకాలములయందు ముఖ్యముగ చూడఁదగినవి.

నృత్యం తత్ర నరేన్ద్రాణా మభిషేకే మహోత్సవే. 13
యాత్రాయాం దేవయాత్రాయాం వివాహేప్రియసజ్గమే,
నగరాణా మగారాణాం ప్రవేశే పుత్త్రజన్మని. 14
శుభార్థిభిః ప్రయోక్తవ్యం మాజ్గళ్యం సర్వకర్మసు,

తా. మీదఁ జెప్పఁబడిన మూఁటిలో మూఁడవదియు మంగళప్రదమునగు నృత్యము రాజపట్టాభిషేకము, తిరునాళ్ళు, ఊరేగింపు, దేవుని యూరేగింపు, పెండ్లి, మిత్రసమాగమము, పురప్రవేశము, గృహప్రవేశము, పుత్త్రోత్సవము వీనియందు ప్రయోగించవలయును.

ఋగ్యజుస్సామవేదేభ్యోవేదాచ్చాథర్వణాత్కమాత్.