తా. నందికేశ్వరుఁడు:- ఓ యింద్రుఁడా! నాలుగువేల గ్రంథములు గల భరతార్ణవమనెడు గ్రంథమును తెలియఁజెప్పెదను. నీ వవహితుఁడవై వినుము.
ఇంద్ర ఉవాచ:-
| | నన్దికేశ దయామూర్తే విస్తరాత్సంవిహాయ మే, | 8 |
తా. ఇంద్రుడు:- దయామూర్తివైన నందికేశ్వరుఁడా! ఈగ్రంథమును సంగ్రహించి నాట్యశాస్త్రార్ధములను యథాక్రమముగా నాకుఁ జెప్పుము.
నన్దికేశ్వర ఉవాచ:-
| | వదామి సుమతే దేవ సంక్షిప్య భరతార్ణమ్, | 9 |
తా. నందికేశ్వరుఁడు:- ఓయింద్రుఁడా! భరతార్ణవమనెడు గ్రంథమునకు సంక్షేపమగు దర్పణమను నీగ్రంథమును జెప్పదను దీనిని శ్రద్ధాళువై వినుము.
| | నాట్యం నృత్తం నృత్యమితి మునిభిః పరికీర్తితమ్, | |
తా. ఓయింద్రుఁడా! ఋషులు నాట్యము, నృత్తము, నృత్యము నని మూఁడువిధములఁ జెప్పుచున్నారు.
| | నాట్యం తన్నాటకేష్వేవ యోజ్యంపూర్వకథాయుతమ్. | 10 |
తా. నాట్యమనునది నాటకమునందు మాత్రము పూర్వకథతోడ వినియోగింపఁదగినది.
| | రసభావవిహీనం తు నృత్తమిత్యభిధీయతే, | |