తా. సంపెగమ్రానియందు అధోలాంగూలహస్తమును వినియోగింపవలెనని పూర్వశాస్త్రజ్ఞులచే చెప్పఁబడెను.
ఖదిరవృక్షహస్తః
| అధోనతస్తామ్రచూడః కరః ఖదిరవర్ణనే, | |
తా. తామ్రచూడహస్తమును మిక్కిలి క్రిందుమొగముగ వంచి పట్టునెడు నల్లతుమ్మచెట్టునందు చెల్లును.
శమీవృక్షహస్తః
| శమీవృక్షే సమాఖ్యాతః కరోయ శ్శ్లిష్టకర్తరీ. | 663 |
తా. శ్లిష్టకర్తరీహస్తము జమ్మిచెట్టునందు చెల్లును.
అశోకవృక్షహస్తః
| పతాకౌ మణిబంధస్థౌ సమ్యక్తిర్యక్కృతౌ యది, | 664 |
| పతాకస్వస్తికోహస్తః అశోకాభినయేస్మృతః, | |
తా. పతాకహస్తములు మనికట్టులందు చేర్చి యడ్డముగాఁ బట్టఁబడినయెడ పతాకస్వస్తికహస్త మగును. ఇది ఆశోకవృక్షమునందు చెల్లును.
సిందువారవృక్షహస్తః
| సిందువారతరౌ యోజ్యః కరశ్శ్లిష్టమయూరకః. | 665 |
తా. వావిలిచెట్టునందు శ్లిష్టమయారహస్తము చెల్లును.
ఆమలకవృక్షహస్తః
| తర్జనీ మధ్యమా హస్త త లే సమ్మిశ్రితే యది, | 666 |
| సంయమాభిధహస్తో౽యం భవేదామలకేద్రుమే, | |