తా. తర్జనీమధ్యమలను అరచేతిలో జేర్చి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టిన నది సంయమహస్త మౌను. ఈహస్తము ఉసిరికచెట్టునందు చెల్లును.
కురవకవృక్షహస్తః
| కర్తరీత్రిపతాకౌచ జ్ఞేయౌకురవకద్రుమే. | 667 |
తా. కర్తరీత్రిపతాకహ స్తములు ఎఱ్ఱపువ్వులగోరంటచెట్టునందు చెల్లును.
కపిత్థవృక్షహస్తః
| అలపద్మే స్వస్తికౌ చేత్కపిత్థార్థేనియుజ్యతే, | |
తా. అలపద్మహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ వెలగమ్రానియందు చెల్లును.
కేతకీవృక్షహస్తః
| పతాక చతురాభిఖ్యౌ స్వస్తికౌ మణిబద్ధయోః. | 668 |
| కేతకీవృక్షభేదే౽పి యుజ్యేతే దేవమంత్రిణి, | |
తా. పతాకచతురహస్తములను మణిబంధములందు స్వస్తికములుగఁ బట్టినయెడ పచ్చమొగలిచెట్టునందును దేవమంత్రియందును చెల్లును.
శింశపావృక్షహస్తః
| అర్ధచంద్రౌ స్వస్తికౌ చేత్ప్రయోజ్యౌ శింశపాతరౌ. | 669 |
తా. అర్ధచంద్రహస్తములను స్వస్తికములుగఁ బట్టిన ఇరుగుడుమ్రానియందు చెల్లును.
నిమ్బసాలవృక్షహస్తౌ
| శుకతుండౌ స్వస్తికౌచే న్నిమ్బేసాలేనిరూపితౌ, | |
తా. శుకతుణ్డహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ వేఁపమ్రానియందును, సాలవృక్షమందును చెల్లును.