5. వామనావతారహస్తలక్షణమ్
| ఊర్ధ్వాధో ధృతముష్టిఖ్యాం సవ్యాన్యాభ్యాం యది స్థితః, | 611 |
తా. మీఁదుగాను క్రిందుగాను ఎడమకుడిచేతులచే రెండుముష్టిహస్త ములు పట్టఁబడినయెడ వామనావతారహస్త మగును.
6. పరశురామావతారహస్తలక్షణమ్
| వామం కటితటే న్యస్య దక్షిణే౽ర్ధపతాకకః, | 612 |
తా. ఎడమచేతిని నడుమునం దుంచి కుడిచేత అర్థపతాకహస్తమును బట్టునెడ పరశురామావతారహస్త మగును.
7. రఘురామావతారహస్తలక్షణమ్
| కపిత్థం దక్షిణే హస్తే వామే తు శిఖరఃకరః, | 613 |
తా. కుడిచేత కపిత్థహస్తమును, ఎడమచేత శిఖరహస్తమును క్రిందుమీఁదులుగా పట్టఁబడినయెడ రామచంద్రావతారహస్త మగును .
8. బలరామావతారహస్తలక్షణమ్
| పతాకో దక్షిణే హస్తే ముష్టి ర్వామకరే తథా, | 614 |
తా. కుడిచేత పతాకహస్తమును, ఎడమచేత ముష్టిహస్తమును పట్టఁబడినయెడ బలరామావతారహస్త మగును.