తా. మత్స్యహస్తమును జూపి రెండుత్రిపతాకహస్తములను భుజశిరస్సులకు సమముగాఁ బట్టినయెడ మత్స్యావతారహస్త మగును. ఇది మత్స్యావతారమం దుపయోగించును.
2. కూర్మావతారహస్తలక్షణమ్
| కూర్మహస్తం దర్శయిత్వా తతస్స్కంధసమౌకరౌ. | 607 |
| త్రిపతాకౌ యది ధృతౌ యుజ్యతే కూర్మజన్మని, | 608 |
తా. కూర్మహస్తమును జూపి భుజశిరస్సులకు సమముగా త్రిపతాకహసములు పట్టినయెడ కూర్మావతారహస్త మగును. ఇది కూర్మావతారమందు చెల్లును.
3. వరాహావతారహస్తలక్షణమ్
| దర్శయిత్వా వరాహం తు కటిపార్శ్వసమౌ కరౌ, | 609 |
తా. వరాహహస్తమును జూపి పిరుదులయందు హస్తముల నుంచునెడ వరాహావతారహస్త మగును.
4. నృసింహావతారహస్తలక్షణమ్
| వామే సింహముఖం ధృత్వా దక్షిణే త్రిపతాకకః, | 610 |
తా. ఎడమచేత సింహముఖహస్తమును, కుడిచేత త్రిపతాకహస్తమును బట్టినయెడ నృసింహావతారహస్త మగును.