ఈ పుట ఆమోదించబడ్డది
15. వాయుహస్తలక్షణమ్
| అరాళో దక్షిణే వామే హస్తేచా౽ర్ధపతాకకః. | 595 |
| ధృతౌ చే ద్వాయుదేవస్య హస్తఇత్యభిధీయతే, | |
తా. కుడిచేతియందు అరాళహస్తమును, ఎడమచేతియందు అర్ధపతాకహస్తమును పట్టఁబడినయెడ వాయుహస్త మగును.
16. కుబేరహస్తలక్షణమ్
| వామే పద్మం దక్షిణేతు గదా యక్షపతేః కరః. | 596 |
తా. ఎడమచేతియందు పద్మహస్తమును, కుడిచేతియందు గదాహస్తమును పట్టఁబడినయెడ కుబేరహస్త మగును.
అథ నవగ్రహహస్తా నిరూప్యంతే.
1. సూర్యహస్తలక్షణమ్
| అంసోపకణ్ఠే హస్తాభ్యాం సోలపద్మ కపిత్థకౌ, | 597 |
తా. భుజశిరస్సులసమీపములందు రెండుచేతులచే సోలపద్మ కపిత్థహస్తములు పట్టఁబడినయెడ సూర్యహస్త మగును.
2. చంద్రహస్తలక్షణమ్
| సోలపద్మం వామకరే దక్షిణేచ పతాకకః, | 598 |
తా. ఎడమచేతియందు సోలపద్మహస్తమును, కుడిచేతియందు పతాకహస్తమును పట్టఁబడినయెడ చంద్రహస్త మగును.