3. అఙ్గారకహస్తలక్షణమ్
| వామే కరేతు సూచీస్యా ద్దక్షిణే ముష్టిహస్తకః, | 599 |
తా. ఎడమచేత సూచీహస్తమును, కుడిచేత ముష్టిహస్తమును పట్టఁబడినయెడ అంగారకహస్త మగును.
4. బుధహస్తలక్షణమ్
| తిర్యగ్వామే ముష్టిహస్తః దక్షిణేచ పతాకకః, | 600 |
తా. ఎడమచేత నడ్డముగా ముష్టిహస్తమును, కుడిచేత పతాకహస్తమును పట్టఁబడినయెడ బుధహస్త మగును.
5. బృహస్పతిహస్తలక్షణమ్
| హస్తాభ్యాం శిఖరం ధృత్వా యజ్ఞసూత్ర ప్రదర్శనే, | 601 |
తా. రెండుహస్తములచే శిఖరహస్తమును, యజ్ఞసూత్రప్రదర్శనమందువలె పట్టినయెడ బృహస్పతిహస్త మగును. ఇది ఋషులయందును, బ్రాహ్మణులయందును చెల్లును.
6. శుక్రహస్తలక్షణమ్
| వామోర్ధ్వభాగే ముష్టిస్స్యా దధస్తా ద్ధక్షిణేన చ, | 602 |
తా. ఎడమప్రక్క మీఁదుగాను, కుడిప్రక్క క్రిందుగాను ముష్టిహస్తము పట్టఁబడినయెడ శుక్రునిహస్త మగును.