పుట:Abhinaya darpanamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. అయిదు వ్రేళ్ళను చేర్చి పట్టఁబడునది ముకుళహస్త మనఁబడును.

వినియోగము:—

కుముదే భోజనే పఞ్చబాణే ముద్రాదిధారణే.

405


నాభౌచ కదలీపుష్పే యుజ్యతే ముకుళఃకరః,

తా. కలువపువ్వు, భోజనము చేయుట, మన్మథుఁడు, ముద్రలు ధరించుట, బొడ్డు, అరఁటిపువ్వు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థముకుళహస్తలక్షణమ్

క్లిష్టాంగుళిః పద్మకోశో యదిస్యాన్ముకుళఃకరః.

406


భానుం ప్రగృహ్ణతః పూర్వం బిమ్బమేవేతిశఙ్కయా,
మారు తేర్ముకుళోజాతః ఋషి స్తస్యవిశాఖలః.

407


సఙ్కీర్ణజాతిః కపిలవర్ణ శ్చంద్రో౽ధిదేవతా,

తా. పద్మకోశహస్తముయొక్క వ్రేళ్ళను చేర్చి పట్టినయెడ ముకుళహస్త మవును. పూర్వము ఆంజనేయుఁడు దొండపండనెడి శంకచేత సూర్యుని పట్టఁబోయినపుడు అతనివలన ఈముకుళహస్తము పుట్టెను. ఇది సంకీర్ణజాతి. దీనికి విశాఖలుఁడు ఋషి. కపిలవర్ణము, చంద్రుఁడు అధిదేవత.

వినియోగము:—

దానే జపే దీనవాక్యే భోజనే పద్మకోశకే.

408


ఆత్మనిప్రాణనిర్దేశే పఞ్చసఙ్ఖ్యానిరూపణే,
కాముకోచ్చరితే బాలచుమ్బనే దేవపూజనే.

409


ఛత్రాదీనాంచ ముకుళే ఫలగ్రహనిరూపణే,
సఙ్కీర్ణజాత్యాం కపిలే ముకుళఃకరఈరితః.

410