పుట:Abhinaya darpanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. దానము, జపము, దీనవాక్యము, భోజనము, తామరమొగ్గ, ఆత్మ, ప్రాణములను నిర్దేశించుట, అయిదనుట, కాముకునిమాట, బిడ్డలను ముద్దు పెట్టుకొనుట, దేవపూజ, గొడుగు మొదలగువానియొక్క ముడుగు, ఫలములను గ్రహించుట, సంకీర్ణజాతి, కపిలవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.

27. తామ్రచూడహస్తలక్షణమ్

ముకుళేతామ్రచూడస్స్యా
త్తర్జనీ వక్రితా యది,

తా. ముకుళహస్తమునందలి తర్జనిని వంచిపట్టినయెడ తామ్రచూడహస్త మగును.

వినియోగము:—

కుక్కుటాదౌ బకే కాకే౽ప్యుష్ట్రేవత్సేచ లేఖనే.

411


తామ్రచూడకరాఖ్యోఽసౌ కీర్తితో భరతాగమే,

తా. కోడి మొదలైనది, కొంగ, కాకి, ఒంటె, దూడ, వ్రాయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థతామ్రచూడహస్తలక్షణమ్

పతాకస్య కనిష్ఠాయాం యత్రా౽౦గుష్ఠు నిపీడనమ్.

412


తమేవతామ్రచూడాఖ్యం వదంతి భరతాదయః,

తా. పతాకహస్తమునందలి చిటికెనవ్రేలిని బొట్టనవ్రేలు తాఁకినయెడ తామ్రచూడహస్త మగును.