పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
79
ఆవడాబాయి

విద్య, డ్రాయింగు మొదలగు నితరవిషయములు నేర్చుకొనుటవలన నాకు మనోల్లాసము గలుగును. ఇట్లు సుఖసంతోషముతోను, స్వతంత్రముగాను అనఁగా నితరులపై భారము వేయక నాజీవితము గడపఁ గలశక్తి నాకిచట నేర్పఁబడు విద్యవలనఁ గలుగును."

(పైని వ్రాయఁబడిన వ్యాసమును జదివి పరీక్షకుఁ డామెను మిగుల మెచ్చుకొనెను. ఇందుకాయన 40 మార్కులలో 35 మార్కులిచ్చెను. ఈపరీక్షయం దన్నియుఁ గలసి 525 మార్కులుండెను. అందు 430 మార్కు లీమెకుఁ దొరికెను. ఇట్లు నూటికి 82 మార్కులు సంపాదించు విద్యార్థులు బహు అరుదని యందఱకును దెలిసినవిషయమే.

పైనుదాహరించిన ఆవడాబాయి వ్యాసము మూలభూత మయిన యింగ్లీషు వ్యాసమునుండి వ్రాయఁబడినదికాదు. ఇంగ్లీషుయొక్క మహారాష్ట్ర అనువాదము ననుసరించి వ్రాయఁబడినది. కాన నిందు మూలములోనుండు భాషాశోభ యంతయులోపించి యుండవచ్చును. అయినను ఆమెయొక్క యుదార కల్పనము, పరోపకారబుద్ధి యిందువలన వ్యక్తమగుచున్నది. ఆవడాబాయికిఁ దోఁచిన కల్పనలలో నెల్ల నొక్కటి మిగుల నాహ్లాదకరముగా నున్నది. అది యేదయన, విద్యావంతులయినతండ్రితోఁబుట్టువులతో వారికిసంతోషముఁ బుట్టించెడి గొప్ప గొప్ప సంగతులనుగుఱించి ముచ్చటించ వలయునని యామెయిచ్చ. మనదేశమునందు మహావిద్యాంసులయి రాజకీయసాంఘిక సంస్కరణము మొదలయిన పరోపకారకృత్యములచే దేహము సమర్పించిన యనేక పురుషులకు