పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఖడ్గతిక్కన భార్య.

అమృతం సద్గుణాభార్యా. [1]

ఈయువతీరత్నముయొక్క నామధేయ మయినను తెలియనందువలన నీమెభర్తం పేరిటనే యీమెను జనులు గుర్తించెదరు. 13 వ శతాబ్దమున సూర్యవంశపు రాజగు మనుమసిద్ధి నెల్లూరిమండలము పాలింపుచుండెను. ఆయన యాస్థానమునందున్న కవి తిక్కన. కార్యతిక్కన, ఖడ్గతిక్కన యను సహోదరులలోఁ బరాక్రమవంతుఁడగు ఖడ్గతిక్కన నియోగి బ్రాహ్మణుఁడు. ఈయన తన పరాక్రమమువలన రాజుచే మిగులమన్నింపఁబడుచుండెను.

ఖడ్గతిక్కనభార్య విద్యావతియు, గుణవతియునై సదా పతి శ్రేయము నే కోరుచుండెను. ఆమెభర్త చేసినదంతయు మంచిపని యని యూఱకుండక యాతఁ డేదేని కానికార్యము చేయఁ దలఁచినయెడల తనచాతుర్యమువలన నాతనిచే నట్టికార్యము జరుగకుండఁ జేయుచుండెను. ఇందునకు నిదర్శనముగా నొకప్పుడామె చేసిన చాతుర్యమిం దుదాహరించెదను.

ఒకానొకసమయమున రాజగు మనుమసిద్ధిపై శత్రురాజులు దండెత్తి వచ్చిరి. అపుడు కొంతసైన్యమునుతోడిచ్చిరాజు ఖడ్గతిక్కనను శత్రువులతో యుద్ధమున కంపెను. ఖడ్గతిక్కన

  1. సద్గుణవతి యగుభార్య అమృతమువలె హితకరురాలు