పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
58
అబలాసచ్చరిత్ర రత్నమాల.

యెంతటి శౌర్యవంతుఁ డయినను వైరులధిక సైన్య సహితులగుటచే నీతనిశౌర్య మేమియు వినియోగింప కుండెను. ఇట్లుకొంతవడి పోరాడితనకు జయము కలుగు నన్నయాస సున్నయగుటచే ఖడ్గతిక్కన యుద్ధభూమినుండి పాఱి తన గృహమునకు వచ్చెను.

పరులకోడి తనభర్త పాఱివచ్చుట విని మానవతి యగు నాతనికాంత మిగుల చింతించి సమయోచితబుద్ధి గలది యగుటచే పెనిమిటి వచ్చులోపల మఱుఁగు స్థలమునందు స్నానజలముంచి నీళ్ల బిందెకు పసపుముద్ద యంటించెను. ఇట్లు స్త్రీలు స్నానముచేయుటకు నావశ్యకమగు వస్తువు లచ్చటనుంచి యామెభర్తరాఁగానే యాదరింపక తిరస్కారముగా స్నానము చేయుఁడని చెప్పెను.

తిక్కన తనభార్య ముఖమునందలితిరస్కార భావమును గని యపుడేమియుననక స్నానమునకరిగెను. అచట నాఁడువారి కుంచునట్లొకమంచ మడ్డముగానుంచి నీళ్ళబిందెకు పసుపుముద్ద యద్దుటఁగని తిక్కన యది తాను యుద్ధమునుండి పాఱి వచ్చినందుకు భార్య తనను దిరస్కరించుటకై చేసినపనియని తెలిసికొనెను. అయినను ఆయన యంతటితో నూరకుండక తన భార్యను బిలిచి యిది యేమియని యడిగెను. అంత నా వీరపత్ని యాతనికి పౌరుషము కలుగుటకయి యీ పద్యముఁ జదివెను.

               క. పగరకు వెన్ని చ్చినచో!
                   నగరే నిను మగతనంపు నాయకులందున్?