పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పన్నా.

53

ఇట్లుండఁగా నొకనాఁటిరేయి రాజనగరమునం దంతటను నిశ్చలముగా నున్న సమయమున పన్నా రాజపుత్రునివానితో సమవయస్కుఁడగు తనపుత్రుని నిదుర పుచ్చితానుసమీపమున నేదోకుట్టుకొనుచు కూర్చుండెను. ఇంతలో ద్వారమావల నేమో కాలుచప్పుడు వినవచ్చినందున నాదాది లేచి చూచెను. అప్పుడు పైనిఁ జెప్పఁ బడిన మంగలివాఁడు మిగులనాతురతతో వచ్చుటఁగని పన్నా "నీవింత తొందరగా వచ్చి పిచ్చివానివలె నాతురుఁడవయ్యెదవేల? ఏదియేని యప్రియమా?" యని యడిగెను. అందు కానాపితుఁడు "అవును మిగుల ఘాత కాఁబోవుచున్నది. ఇంక నొక గడియ కా బనబీరుఁడు రాజపుత్రునిజంప నిట కేతెంచును." ఈవాక్యములు చెవిని సోఁకగానే పన్నా దేహము ఝల్లు మన నొక యూర్ధ్వశ్వాసను విడిచి యిట్లనియె. 'నే నిన్ని దినములు వచ్చునని భీతిల్లు చుండినదే నేఁడు ప్రాప్తమయ్యెను. ఆదుష్టునిపై నాకిదివఱకే యనుమానముండెను కాని నే నాఁడుదాన నగుటచే నేమి చేయుటకును జాలకుంటిని. ఏది యెటులైనను నిప్పుడు రాజపుత్రుని రక్షించుట మనకర్తవ్యము" అందుకామంగలి "యది బహుదుర్ఘటము. అయినను నీకేదేని యాలోచన దోఁచినచో త్వరగాఁ జెప్పుము. నీ వెట్టికార్యము చెప్పినను నేను నిర్వహింపఁగలను" అనెను. తదనంతరము పన్నా యొకించుక విచారించి "రాజపుత్రుని నొకానొకసుస్థలమునకుఁ గొని పోవుదమ"ని చెప్పెను. "అట్లు చేయుటకు వీలులేదు. నేఁ డేబాలకులను రాజనగరు వెలుపలికిఁ గొనిపోవకుండ పాపాత్ముఁడు కట్టడిచేసెను. పన్నా "అటులైననీరాజపుత్రుని నొకతట్టలోఁబెట్టి పైనపెంట