పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
40
అబలాసచ్చరిత్ర రత్నమాల.

చిరి. అందువలన నానూతనదంపతు లచటికి నరిగిరి. అచట నీలగిరిపర్వతమునందలి గాలివలన కృపాబాయిదేహ మించుక యారోగ్యముగా నుండెను.

అచట నుండుకాలమునం దామె యూరకుండఁ జాలక నాగ్రామమునందలి యవనబాలికలకొఱ కొకపాఠశాల స్థాపించెను. ఆపాఠశాల ప్రస్తుతము చక్కఁగా నడుచుచున్నదఁట. ఈమె యచ్చట నున్న కాలముననే యాంగ్లేయ వారపత్రికలకును, మాసపత్రికలకును వ్యాసములు వ్రాయుచుండెను. ఆమెవ్రాసిన వ్యాసము లత్యంతప్రశంసనీయము లగుటచే స్వల్పకాలముననే కృపాబాయి కీర్తి నలుగడల నల్లుకొనసాగెను.

1884 వ సంవత్సరము మి. సత్యనాథను గారిని రాజమహేంద్రవరమునకు మార్చిరి. అచటికి వచ్చినది మొదలు కృపాబాయిగారి రుగ్ణత విశేషింపసాగెను. ఇట్లురోగగ్రస్తురాలుగ నుండియు నామె యనేకవ్యాసములను వ్రాయుచునే యుండెను. ఆమరుసంవత్సర మామె కుంభకోణమున కరిగెను. అచట నామెరుగ్ణత యించుక నిమ్మళముగా నుండెను. అచట ను ఆమె వ్యాసములను వ్రాయుచునే యుండెను. కుంభకోణమునందుండు కాలముననే కృపాబాయికి కవిత్వస్ఫూర్తియు ప్రబంధరచనేచ్ఛయుఁ గలిగెను. అప్పు డామె కొన్ని పద్యములు రచియించెను. వానిని జదివినయెడలనామెకుఁ గల ఆంగ్లభాషాకవిత్వస్ఫూర్తి వెల్లడి యగునని తజ్ఞులు చెప్పుచున్నారు. ప్రబంధరచనేచ్ఛ కలిగియుఁ దనవలన నదియగుట దుస్తరమని తలఁచి యామె బహుదినము లాప్రయత్నమే చేయకుండెను.