పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
39
కృపాబాయి

త్సరము చదివి సంవత్స రాంతమునందైన పరీక్షయందు సమస్తవిషయములలోఁ గృతార్థురాలాయెను. ఆమె తెలివి గని పరీక్షకుఁ డామెను మిగుల మెచ్చుకొనెను. కాని కృపాబాయి యామెప్పున కెంతమాత్రమును గర్వపడక పూర్వమువలెనే వినయాదిగుణము గలిగి వర్తించుచుండెను.

కృపాబాయికి విద్య నభ్యసించుటయం దధికాసక్తి కలిగినను, ఆమె దేహము మాత్ర మాశ్రమనోర్చునంతటి దృఢమైనది గానందునఁ బరీక్షకై చదువునపు డామెకెంత మాత్రము శ్రమదోఁచకుండినను పరీక్షానంతరము వెంటనే విశేషముగాఁ గాయలాపడెను. అప్పటినుండియు మరల నామె శరీర మెప్పుడును స్వస్థపడనందున విధిలేక విద్యాభ్యాసమును మానుకొనవలసిన దాయెను. ఇట్లు వైద్య విద్యాభ్యాసమును విడిచినంతమాత్రమున నామె నిరుత్సాహురాలుగాక వేరువిధముగా జనులకు హితముచేయ యత్నింపుచుండెను.

రెవరెండు సత్యనాథనుగారి పుత్రుఁడగు సాముఎల్ సత్యనాధనుగారు ఇంగ్లండునందలి కేంబ్రీజు విశ్వవిద్యాలయమునందు విద్య నభ్యసించి పరీక్షయందుఁ గృతార్థుఁడయి 1881 వ సంవత్సరమునందు మరల స్వదేశమునకు వచ్చెను. సాముఎల్ సత్యనాధనుగారు కృపాబాయియు నొకయింటనే వాసము చేయుచుండినందునవా రిరువురును ఒకరి సద్గుణముల నొకరు కని పరస్పరానురాగము గలవారైరి. తదనంతరము స్వల్పకాలములోనే వారికి వివాహమయ్యెను. వివాహానంతరము సాముఎల్ సత్యనాధనుగారిని ఉదక మండలమందలి యొకకళాశాలయందు ముఖ్యోపాధ్యాయునిగా నియమిం