పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
293
వనలతాదేవి.

వనలతాదేవి తనభర్తను గేవలము దైవతుల్యునిగా భావించి యతని పనిని నౌకరులచేఁ జేయింపక తానే చేయుచుండెను. ఆమె పతిభక్తిని గాంచినవా రందఱు నిజమయిన పతిభక్తియనిన నిదియేగదాయని మెచ్చుచుండిరి. వ్యాధిలోనుండి భర్తకుఁ దాను భోజన మిడలేని సమయమునందు సహిత మామె భర్తకును, గుమారునకును దనయెదుట భోజనము పెట్టింపుచుండెను. ఈమె మరణదినమునం దీమె భర్తకుఁ గొంచెము దేహమస్వస్థముగా నుండెను. ఈమె మరణమున కరగంటకు ముందు భర్తవెచ్చని చొక్కా దొడిగికొనకుండుటను జూచి "మీశరీర మస్వస్థముగానుండినను మీరు వెచ్చనిబట్టలు తొడిగికొనక యేలయుంటిర"ని యాయంగీని తెప్పించి యాతని కిప్పించి తొడిగికొనునట్టు చేసెను. తనమరణవేదన నొకమూలనుంచి పతికళ్యాణమునే గోరునీకాంతయొక్క పతిభక్తి నెంతఁ గొనియాడినను దీఱదు. అనేకులను కొడుకులకును, గూఁతులనుగని వారినిఁ దననేర్పుచేఁ బెంచి పెద్దవారినిఁజేసి తనకుఁగల శిశుపాలనము నందలి నిపుణతను వెల్లడింపఁ దనకు సమయము చాలకున్నను నీమె మిగుల దక్షతతోఁ బెంచి విడిచిపోయిన మూఁడుసంవత్సరముల బాలుని చర్యలు చూచినచోనామెకుఁ దెలిసిన మాతృకర్తృత్వ మహత్వ మితరమాతలకుఁ దెలియుట దుస్తరమని యందఱకును దోఁచును. అంత చిన్న శిశువు తనతల్లి యాజ్ఞప్రకారము వర్తించుచుండెను. ఇంత చిన్న వయసుననే వాని తల్లి వాని కెన్నోనీతులను గఱపెను. వనలతాదేవికిఁ దన రుగ్ణత కుదురదని స్పష్టముగాఁ దెలిసినపిదప నొకదినమునం దెవ్వరును లేనిసమయమునఁ దనచిన్నికొమరునిఁ దనయొద్దికిఁ