పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
272
అబలాసచ్చరిత్ర రత్నమాల.

రేవు విడిచి కొంతదూర మరిగినపిదపఁ దుపాను (గాలివాన) ప్రారంభమయి సముద్రమునం దలలు మిన్నంట సాగెను. అంత నాపడవలోని జనులందఱు మిక్కిలి భయంబు నొంది యాప్తులం గలిసి యేడ్చువారును పరమేశ్వరునిఁ బ్రార్థించువారును పడవమునిగినఁ జత్తుమను భయముచే మూర్ఛిల్లువారును నై యుండిరి. పడవవాం డ్రాజనుల కెంత ధైర్యము చెప్పినను నా తుపానును గనివారుధైర్య మవలంబింపఁజాలరయిరి. కాని ధనలక్ష్మీమాత్రము ధైర్యమువిడువకుండెను. ఆమెచిన్న నాఁడుపడవలోఁ గూర్చుండునపుడు జాగ్రతగాఁ గూర్చుండవలయుననియు, పడవలో మునగకట్టె లుంచుదురనియు ఒక సేరు మునగకట్టె యొకమనుష్యుని నీళ్ళలో తేల్చఁ గలదనియు, మునగకట్టెను బట్టుకొని యొకపడవవాఁడు సముద్రములో మూడుదినము లుండినను నాకట్టె వానిని ముంచలేదనియు అరేబియన్ నైట్సను గ్రంధములోఁ జదివియుండెను. ఈమాట యా సమయమునందు ధనలక్ష్మికి జ్ఞాపకము వచ్చి యాకట్టెను శోధించి తీసికొనెను. తదనంతర మామె తనచీరను బాగుగా పుట్టగోచిఁ బెట్టిబిగియించెను. అప్పుడు పడవ మునుఁగుటకు సిద్ధముకాగా నామె తనభర్తతోడ నాకట్టెను బట్టుకొని సముద్రములోనికిఁ దిగెను. గిరిజాశంకరుఁ డొకచేత నాకట్టెను రెండవచేత నగల పెట్టెను బట్టుకొని యున్నందున నతని ధ్యాన మాకట్టెను గట్టిగాఁ బట్టుకొనుటకంటెను నగలపెట్టెను భద్రముగాఁ బట్టుకొనుటయందు విశేషముగానుండెను. అదిచూచియామెభర్తచేతి నుండి యాపెట్టెను దీసి యోడలో నొకచిలుక కొయ్యకు తగిలించెను. తరువాత నాపతిపత్ను లిద్దఱు నాకట్టెనుబట్టు