పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
271
ధనలక్ష్మి.

వలసిన విధము. ఇప్పుడు కోడండ్ర బాధించెడి యత్తలకును, అత్తల నవమానించు కోడండ్రకును వీరిచరిత మనుకరణీయము. ఏగృహమున నత్తకోడం డ్రిద్దఱును దమతమధర్మములను దప్పక నడుచుచుందురో యాగృహమునందు సుఖమున కేమికొఱఁత? ధనలక్ష్మి యత్తమామలకును, భర్తకును నుపచారములు చేసి వారిచే దీవనల నంది పతివ్రతా ధర్మములను దప్పక పాలింపుచుండెను. అత్తవలెనే ధనలక్ష్మికిని గృహోపయోగకరములగు పుస్తకములను, ఇతర గ్రంధములును చదువుటయం దిచ్ఛ యధికముగా నుండెను. ఇంతియగాక యామె తాఁ జదివిన గ్రంధములయందలి సారాంశము నంతను మఱవక తన హృదయమునఁ బదిలపఱచుచుండె. ఇట్లా యత్తకోడండ్రగు నాయిరువురు పతివ్రత లుండుటవలన నాగృహం బధిక శోభావంతంబయి యానందసాగరమున నోలలాడుచుండెను. కాని పతివ్రతల పరీక్ష సంకటసమయంబునంగాని కాదని కాఁబోలును పరమేశ్వరుఁడు వారిపైఁ గష్టము తెచ్చిపెట్టెను. ఆప్రకార మెట్లనిన వి. శ. 1945 వ సంవత్సరము చైత్ర శుద్ధమునందుజంబూసరవాసుఁడగు విశ్వనాధుఁడనువారి బంధువునియింట జోడుపెండ్లిండ్లుండెను. ఆవివాహమునకు ధనలక్ష్మియు గౌరీశంకరుండును బోయిరి. ఖంబాత్‌లో వివాహమయిన వెనుక పెండ్లివారందఱును జంబూసరమునకు వచ్చుట కయి పడవలో నెక్కిరి. రెండువివాములవారును గలిసినందువలన నాపడవలో జనులు బహుమందియుండిరి. ఈపడవలోనివారు జంబూసరమునకుఁ జేరుటకు ఖంబాత్ నుండి కావీ రేవువఱకును సముద్రములో రావలసియుండిరి. పడవ