పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
264
అబలాసచ్చరిత్ర రత్నమాల.

చటఁ బ్రజలలో బొత్తుగా నైకమత్యము లేక యుండినందున వైరులకు మిగుల ననుకూలముగా నుండెను. ఇట్టి సమయమునందు చాందబీబీ మిగుల యుక్తిగాలోకులను సమాధానపఱచి అబ్దుల్ హసనునకుఁ బ్రధానిత్వమిచ్చి రెండుపక్షములవారిని నొకటిగాఁజేసి శత్రువులను మరలిపోవునట్లు చేసెను! షహాలు తమతమనగరముల కరిగినపిదప దిలార్‌ఖానను సిద్దీ మిక్కిలి గర్వించి అబ్దుల్ హసనును జంపించి తానేప్రధాని యయ్యెను.

ఇట్లీరాజ్యమున నొకసంవత్సరముపై నాఱుమాసములలో ముగ్గురు మంత్రులైనను నొకరును నెగ్గకుండిరి. దిలార్‌ఖాన్ సిద్దీ మిగుల చాతుర్యవంతుఁడైనందున నతఁడు తనకు రాజ్యకాంక్ష కలిగియు దానిని వెలిపుచ్చక మిగుల జాగరూకుఁ డయి యుండెను. ఇతఁడు రాజ్య వ్యవస్థను బహు చక్కఁగాఁ జూచెనుగాని చాందబీబీ యచటనుండిన తనయాటలేమియు సాగవని తెలిసికొని ఇబ్రాహిమ్‌ఆదిల్‌షహా చెల్లెలగు ఖుదీజా సుల్తానాయను రాజపుత్రిని మూర్తిజా నిజామ్‌షహాకొడుకగు మిరాన్ హుసేనున కిప్పించి క్రీ. శ. 1584 వ సంవత్సరమున ఖుదీజా సుల్తానాకుఁ దోడు చాందబీబీనిని జామ్‌షహీమిఁ బంపి బాలరాజును నాశ్రయహీనునిఁ జేసెను.

చాందబీబీ నిజామ్ శాహీకివచ్చినపిదప నచట నైదాఱు సంవత్సరములలోమూర్తిజాను జంపి యాతని కొడుకగు మిరాన్‌హుసేను అతనినిఁజంపి యాతని పినతండ్రి యగు బురాణ సహాయును, అతని వెనుక నాతని పుత్రుఁడగు ఇస్మాయెల్ షహాయును తదనంతరమాతని తమ్ముఁడగు ఇబ్రాహిమ్‌నిజాం షాహాయును రాజ్యముచేసిరి. ఇబ్రాహి మ్మరణానం