పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాందబీబీ.

265

తరమునం దతని పుత్రుఁడగు బహుదూర్‌ను కారాగృహమునం దుంచిఆన్ అను దక్షణీతురకమంత్రి, నిజామ్‌షాహిలోనివాఁడని చెప్పఁబడు అహమ్మదనువానిని సింహాసనముపై నుంచితానే రాజ్యముచేయ మొదలుపెట్టెను. ఈ అహమ్మదునకు రాజ్యము నిచ్చుట సిద్దీ సరదారుల కిష్టములేక బహుదురునకు ననువయస్కుఁడగు నొకబాలునిఁ దెచ్చి వానినే రాజ్యార్హుఁడని చెప్పఁదొడఁగిరి. ఇట్లు వారు రెండుపక్షములవారయి సైన్యసహితులగుటఁ గని మి ఆన్ మంజూ మిగుల చింతించి అక్బర్ బాదుషా కొడుకగు మురాదనునాతనికి మీరు నాకుసహాయముచేసినచో అహమ్మదనగరము మీస్వాధీనము చేయుదునని వర్తమానము నంపెను. కాని మురాద్‌సైన్యసహితుఁడయి వచ్చులోపల అహమ్మదనగరమునం గల రెండుపక్షములవారికిని యుద్ధము జరిగి సిద్దీలను మి ఆన్ మంజూ ఓడించెను. కాన దా ననినప్రకారము అహమ్మదనగరముమురాదున కిచ్చుటకు సమ్మతింపఁడయ్యె. అంత నారాజపుత్రుఁడు యుద్ధసన్నద్ధుఁడయ్యెను. ఆ సమయమున నీ ప్రధాని సైన్యమునంతను ఆదిల్ షహ, కుతుబ్ షహాలను సహాయమునకుఁ బిలువఁబోయెను. ఆతఁ డరిగినపిదప బహుదూర్ రాజ్యమనిసాటించి చాంద బీబీ రాజ్యమును తానే నడుపుచుండెను.

ఆసమయమునం దిద్దఱు ముగ్గురు రాజ్యము తమకే కావలయునని యనుటవలన నచటి లోకులు రెండు మూడు పక్షములుగానుండిరి. ఇట్టి సమయమున చాందబీబీ తనదృఢనిశ్చయమును విడువక, నేహంగఖానునకు శహా అల్లీ సిద్దీకిని వర్తమానముల నంపి వారిని రాజధానికిఁ బిలువనంపెను.