పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/236

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మును. నిర్మల దైవభక్తియు, నప్రతిమసాధువృత్తిఁగని క్రౌంచరా జాతనిని గురువుగా భావించి సేవింపుచుండెను.

ఇచటఁ బద్మావతి భర్తకొఱకు ననేకస్థలముల వెదకించియు వెదకియు జాడఁగానక మిగుల దు:ఖముతోఁ బుంటినింటనేయుండి భర్తజాడ లరయుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినవెనుక క్రౌంచాధీశ్వరుఁడు జయదేవుల వార్తఁ దెలిపి పద్మావతినిఁ దోడుకొని వచ్చుటకయి తనపరివారమును బంపెను. వారు చెప్పినవార్త విని పద్మావతి మిగుల సంతోషముతో భర్తకడ కేఁగెను.

పద్మావతి గురుభార్య యగుటవలనను మిగుల పతివ్రత యని ప్రసిద్ధి గాంచుటవలనను రాజపత్ని మిగుల శ్రద్ధతో నామెవలన ననేకనీతులు వినుచుండెను. ఇట్లొకనాఁడు పద్మావతి పాతివ్రత్యమునుగూర్చి యుపన్యసింపుచుండఁగా నచటికి నొక సేవకుఁడు వచ్చి రాజపత్ని సమీపబంధువుఁ డెవఁడో యొకఁడు లోకాంతరగతుఁ డాయెననియు, ఆయన వియోగము సహింపలేక యాతని భార్య సహగమనము చేయఁబోవు చున్నదనియుఁ దెలిపెను. ఆసంగతి విని యచటి స్త్రీలందఱు మిగుల నాశ్చర్యపడఁజొచ్చిరి. కాని పద్మావతికి నాసంగతియొక విశేషముగాఁ దోఁచకపోవుటవలన నామె ముఖమునం దాశ్చర్యభావ మించుకయుఁ గానుపించదయ్యె అందుకు రాజపత్ని పద్మావతిని "అమ్మా! ఆమహాపతివ్రత సకల సుఖములను విడిచి భర్తతో సహగమనము చేయు నన్న వార్త విని మీకాశ్చర్యము కలుగ లేదా? దయచేసి మీమనోగతము నెఱిఁగింపుఁడ"ని వేఁడుకొనెను. అందుకుఁ బద్మావతి రాజపత్నితో నిట్ల