పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
7
రాణీసంయుక్త.

కాలిందీనదీతీరమునందు జయచంద్రుఁడు తనసేనలతో దిగి యొకదినము తనశిబిరంబులోఁ గూర్చుండి రాబోవుస్థితినిఁ దలఁచుకొని సంతోషించుచుండెను. ఇంతలో నొక సేవకుఁడు తమవైరి సైన్యములోనుండి యొకరాయబారి తమతో మాటలాడ వచ్చెననియుఁ దమ సెలవయినయెడల నాతని నిటకుఁ దోడ్కొని వత్తుననియుఁ జెప్పెను. అందు కాతఁ డాపరిచారకునితో నీ వావల నేయుండి యాతనిని నావద్దకిఁ బంపుమని చెప్పి తాను తనఖడ్గము చేతఁగొని కూర్చుండెను.

అంతఁ గొంతసేపఁటికి నొకతరుణుఁ డచటికివచ్చి జయచంద్రునిపాదముల కెరగెను. ఆవచ్చినయోధుఁడు పురుషుఁడు గాక మనకధానాయికయగు సంయుక్తయే. కాన జయచంద్రుఁడు తనకొమార్తెను గుర్తించి నీ వేమికోరెదవని యడిగినతోడనే యామె ఇట్లనెను. "నాయనా! నేను తమయనుజ్ఞను బొంది మనదేశమునకు శత్రువగుగోరీని జంపఁగోరివచ్చితిని. ఈసమయమునందుఁ బెద్దల యాశీర్వచనముపడసిచనిన తప్పక జయము కలుగును." జయచంద్రుఁడు కూఁతుమాటలు విని కొంతతడ వేమియుఁ దోఁచకుండి పిదప "నోసిస్వేచ్చాచారిణి! ముందుజరుగఁబోవు ప్రజాక్షేమమున కంతకును నీవేకదా మూలమయిన దానవు. పొమ్ము నీ విచటికి వచ్చి నాక్రోధమును హెచ్చించితివేగాని వేరులాభము లేదు" అని కోపముతో ననెను. అందు పై సంయుక్త మిగులవినయముతో "నో నాయనా ! మీరు జన్మభూమిపై ఇంచుక దృష్టిసారింపుఁడు. నిరాశ్రితురాండ్రగు ననేక స్త్రీలమానమును గాపాడుఁడు. మనమెంతో భక్తితోఁ గొలుచు విగ్రహముల నాశమునకుఁ దోడుపడకుఁడు. మన