పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
6
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మింకను ముదరనందున నప్పటికిమాత్రము గోరీకి సాహాయుఁడు గాకుండెను.

పృధివీరాజు మహాశౌర్యముతోఁ దిలావడీయను ఎడారియందుఁ గోరీసైన్యముల పలుమాఱు నోడించెను. పృధివీరాజు పరాక్రమమున కోర్వఁజాలక తుదకుగోరీ బహుకష్టముతో పలాయితుఁ డయ్యెను. పృధివీరాజును విజయానందముతో నితర సామంతులతోఁ దననగరుఁ బ్రవేశించెను.

పృధివీరాజున కయినజయమువలన జయచంద్రున కధికవ్యసనము గలిగి యాతని మనం బెప్పుడును పృధివీరాజు చెఱుపునే కోరుచుండెను. అందువలన నాతఁ డెట్టి నీచోపాయమువలననయిననుఁ బృధివీరాజునకుఁ జెఱుపుజేయ నిశ్చయించెను. అందువలన నాతఁడు తనదూతనంపి పాఱిపోవుచున్న గోరీని మరల మనదేశమునకుఁ గొనివచ్చెను. ఇట్లురప్పించి యాకుత్సితుఁడు తానతనికిఁ దోడుపడుటయే గాక యితర రాజుల ననేకులను నీకుఁ దోడు తెత్తునని నమ్మికఁ దోఁపఁబలికి యాతనిని మరల పృధివీరాజుపైకి యుద్ధమునకుఁ బురికొల్పెను.

జయచంద్రుని సహాయమువడసి మిగుల ధైర్యముతో గోరీ మరల ఢిల్లీనగరముపై దండువెడలెను. జయచంద్రుఁడు తా నన్నప్రకార మితరరాజుల ననేకులను దనవెంటఁదీసికొని యాతురుష్కునికిఁ దోడుపడెను. ఇట్లుచేసి పృధివీరాజుల కిఁక జయము దొరకదని యాదీర్ఘక్రోధి సంతసించుచుండెను. దుర్జనులు తమకార్య మీడేరుటవలన, దేశమునకంతకును నష్టము కలుగునని తెలిసినను వెనుక దీయరుకదా?