పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
171
రాణిఔస్కువరు.

ను, నతనిపుత్రునకును సహితము జరుగుట యసంభవ నీయ మనియును, నూహించి సామంతరాజులును, భ్రిటీషు (ఇంగ్లీషు) వారును రాజ్యము నాతని పత్నియగు నౌస్కువరు కియ్య నిశ్చయించిరి. బ్రిటీషువారి యేజంటు సమయము తటస్థించినచోఁ దాను రాణికి రాజ్యమిచ్చునటుల దొరతనమువారు వారి యనుజ్ఞ వడసియుండెను. ఇది యంతయు విని రాజు సహచరులగు దుష్టులందఱు రాణిరాజ్యము నేలినచోఁ దమదుశ్చేష్ట లేమియు సాగవుగదా యని చింతించి రాణిపై ననేక నేరములు నిర్మించి రాజునకుఁ జెప్పి యతని కామెపై ద్వేషము గలుగఁ జేసిరి. కాని యేజం టొకప్పుడు పటియాలకువచ్చి సంస్థానమునకుఁ గలుగు నష్టము లనేకములఁగని రాజునకుఁ బోధించి రాజ్యము రాణి స్వాధీనము చేసెను. ఈమె రాజ్యమునకు వచ్చినవెంటనే రాజ్యమునందంతటను మిగుల స్వస్థతగానిపించె. ఆమె సత్యవంతుఁడగు నొక బుద్ధిమంతుని మంత్రిగా నేర్పఱచి, యతని సహాయమువలనను, తనబుద్ధిబలమువలనను రాజ్యము నేలుచుండెను. అదివఱ కనేకవత్సరములనుండి పన్నులురాని గ్రామములనుండి వెనుకటి యరినంతను రాఁబట్టెను. సామంతు లియ్యవలసిన ధనమును సైన్యమును మంచి తనముననే చేకొనియెను. ఇందువలన నదివఱ కప్పులలో నుండిన సంస్థానమప్పుడు అప్పుల నన్నిఁటిని దీర్చి బొక్కసములో లక్షధనము కలిగియుండెను. రాజు పాలనదినములలో నూఱుగురుసైనికులను పోగుచేయుట దుస్తరము నుండెను. కాని రాణి రాజ్యమునకువచ్చిన సంవత్సరమునకే రెండువేలగుఱ్ఱపురౌతులను రెండువేల పదాతి సంఘమును నొడఁగూర్చెను. ఈమె పాలనమునకుఁ గాపులు