పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ను, ప్రజలును మిగుల సంతసించిరి. ఉద్యోగస్థు లందఱు తమఁతమ నియమితకార్యములఁ దప్పక చేయుచు రాజభక్తి కలిగియుండిరి. ఇ ట్లీమె మిగుల దక్షతతో రాజ్యము నేలుటఁ గని రాజు సంతసించెను. కాని దుష్టులగు నతని చెలికాండ్ర కీమెరాజ్యముమిగుల దు:ఖకరముగాఁదోఁచి, వారిలో ముఖ్యులగుఆల్బల్ సింగు గుర్జరసింగులనువారురాజుతో రాణినిన్ను విషమిడిచంప యత్నింపుచున్నది యని మనసునకునాఁట దెలిపిరి. వారికిరాణితోనింతవైరమేల కలిగెననఁగానిందు ప్రధముఁడగు ఆల్బల్‌సింగు కొంతభూమి కౌలుకుఁగొని దానిసంవత్సరమున కేడువేల రూపాయలను కొంత సైన్యమునురాజున కిచ్చునట్లేర్పాటు చేసికొనియెను. ఆభూమికి 14 వేలరూపాయ లిమ్మని రాణి యతని నడుగఁగా నతఁ డియ్యక యాభూమిని విడుదలచేసెను. ఆమె యాభూమిపై సాలు 1 టికి 14 వేల రూపాయలను రాఁబట్టెను. రెండవవాఁడగు గుర్జరసింగుఁడును నిట్లేకొంతభూమిని కౌలుకుఁ దీసికొని 7 వందలరూప్యములను రాజునకు నిచ్చుచుండెను. వానినిసహితము 14 వేలరూపాయ లిమ్మని రాణి యడుగఁగా వాఁ డియ్యకుండెను. అందుపై నామె యా పుడమి నింకొకని కిచ్చి 14 వేల రూపాయలను గొనియెను.

రాజు కొంచెము మతిభ్రమ కలవాఁ డయినందున వారిమాటలు విని మిగుల నాగ్రహించి రాణిని, యువరాజగు నామె కొమరుని, సత్యరతుఁడగు నామె మంత్రిని కారాగృహమునం దుంచెను. కాని యతఁడు ధైర్యహీనుఁడైనందున తాఁ జేసినకార్యమువలన నేమి యుపద్రవము సంభవించునో యని భయపడఁ దొడఁగెను. రాణిని కారాగృహమునం దుంచినతో