పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
149
లీలాదేవి

లీలావతికి గణితశాస్త్రమునందుఁ గలయసామాన్య ప్రజ్ఞను చూచి లోకు లీవార్త పుట్టించి రనుటకు సందేహము లేదు. ఆమెకు గణితము చెప్పునెడ వేసిన ప్రశ్నలును, వానియుత్తరములును నొకటిగాఁ జేసి భాస్కరాచార్యులు లీలావతి గణితమనుపేరఁ బ్రసిద్ధిఁ జేసెనని యందురు. ఈసంగతి లీలావతి గణితములోన "బాలే బాలకురంగలోలనయనే లీలావతీ ప్రోపాచ్యతాం" "అయేబాలే లీలావతిమతిమతిబ్రూహి" (లీలావతి యనుబాల యీలెక్క చెప్పుము అనియర్థము) అనిన వాక్యములవలన నీసంగతి నిజమేయయియుండవచ్చునని తోఁచు చున్నది. లీలావతి గణితమువలననే బాలవితంతువయిన లీలావతియొక్కకీర్తి సకలదేశములయందును నిండియున్నది. లీలావతి గణితము, ఫారషీ, యింగ్లీషు మొదలయిన పరభాషలయందుఁగూడ భాషాంతరీకరింపఁబడినది. లీలావతి గణితములోని లెక్క లన్నియుఁ జేయిటకుఁ బురుషులకె మహాప్రయాసముగా నుండును. కాన నిట్టికఠినపు లెక్కలను నేర్చినస్త్రీ యొక్క బుద్ధికుశలత యెంత యుండవలయునో చదువరులే యూహింపఁ గలరు.

ఈలీలావతి చరిత్రమువలనఁ బూర్వకాలమున ఈదేశమునందు స్త్రీవిద్య సర్వసాధారణమయి యుండెనని తెలియుచున్నది.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf