పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండెదరు. పెద్ద పెరిగినకొలది పుత్రికలను పుత్రులవలె జూడక యెటులనైన బెంచవలయునని పెంచుదురు. ఇట్లనుట వలన నాడుపిల్లలను దయతో బెంచువారే యీ దేశమునందు లేరని నాతాత్పర్యము కాదు. అట్తి సజ్జనులుగూడ నున్నారు. కాని, ఈదేశములోని యాడుపిల్లలలో నూటికి తొంబదితొమ్మండ్రు బాలికలు నేను చెప్పినప్రకారమత్యంతాలక్ష్యముతో బెంచ బడుచున్నారనుటకు సందేహము లేదు. ఆంధ్ర మహారాష్ట్ర దేశముల బాలికలస్థితి యంతశోచనీయముగా లేదు. కాని బంగాళా పశ్చిమోత్తర పరగణాలు మొదలయిన దేశములలో నాడుపిల్లలు కలుగుట కుటుంబమునకు నొక గొప్ప సంకటము ప్రాప్తించుటయే యని యెంచెదరు. ఇట్లు మనదేశమునందు బాలికలకు నత్యంత దురవస్థ ప్రాప్తించుటకు గారణము, స్త్రీ లన్నిసంగతులయందును పురుషులకంటె దక్కువ వారని మన దేశమునందుగల వాడుకయే. ఈ వాడుకకు గారణము, స్త్రీల యజ్ఞానదశ. కాన, స్త్రీ విద్యాభివృద్ధియైన గాని, బాలికలకు నిట్టి యవస్ఠ తప్పదు. గనుక దేశాభిమాను లగు సహోదర సహోదరీ మణులారా! మీరు దత్తుగారివలె మీ బాలకులను, బాలికలను సమాన ప్రీతితో జూచుచు బాలికలకు బాలురకువలె నింగ్లీషు ఫ్రెంచులు చెప్పించక పోయినను, మీ మాతృభాషయైన జెప్పించి దేశక్షేమమునకు దోడగుదురని నమ్ముచున్నాను.

బంగాళాస్త్రీ పరికీయబాషయందు నుత్తమకవిత్వము జెప్పి ప్రసిద్ధిగాంచునని యాసమయమునం దెవ్వరును స్వప్న