పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లీ రాజ్యమున నొక సంవత్సరముపై నారు మాసములలో ముగ్గురు మంత్రులయినను నొకరును నెగ్గకుండిరి. దిలార్‌ఖాన్‌సిద్దీ మిగుల చాతుర్యవంతుడైనందున నతడు తనకు రాజ్యకాంక్ష గలిగియు దానిని వెలిపుచ్చక మిగుల జాగరూకుడయి యుండెను. ఇతడు రాజ్యవ్యవస్థను బహు చక్కగా జూచెను గాని, చాందబీబీ యచటనుండిన తనయాట లేమియు సాగవని తెలిసికొని ఇబ్రాహిమ్ ఆదిల్‌షహా చెల్లెలగు ఖుదీజాసుల్తానా యను రాజపుత్రిని మూర్తిజా నిజాంషహా కొడుకగు మిరాన్‌హుసేనున కిప్పించి క్రీ.శ. 1584 వ సంవత్సరమున ఖుదీజాసుల్తానాకు దోడు చాందబీబీని నిజామ్‌శాహీకి బంపి బాలరాజును నాశ్రయహీనుని జేసెను.

చాందబీబీ నిజామ్‌శాహీకి వచ్చినపిదప నచట నైదారు సంవత్సరములలో మూర్తిజాను జంపి యాతని కొడుకగు మిరాన్‌హుసేను, అతనిని జంపి యాతని పినతండ్రియగు బురాణ శహాయును, అతని వెనుక నాతని పుత్రుడగు ఇస్మాయెల్ షహాయును, తదనంతర మాతని తమ్ముడగు ఇబ్రాహిమ్‌నిజాం షహాయును రాజ్యము చేసిరి. ఇబ్రాహిమ్ మరణానంతరమునం దతనిపుత్రుడగు బహదుర్‌ను గారాగృహమనందుంచి మిఆన్ అను దక్షణీ తురకమంత్రి, నిజామ్‌శాహిలోనివాడని చెప్పబడు అహమ్మదను వానిని సింహాసనముపై నుంచి తానే రాజ్యము చేయ మొదలు పెట్టెను. ఈ అహమ్మదునకు రాజ్యమునిచ్చుట సిద్దీ సరదారుల కిష్టములేక బహదురునకు సమవయస్కుడగు నొక బాలుని దెచ్చి వానినే రాజ్యార్హుడని చెప్పదొడగిరి. ఇట్లు