పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చి నెల 25 తేదిని దత్తవిధానము దొరతనమువా రంగీకరింపక రాజ్యమును తామే స్వాధీనపరచుకొని రనిన సంగతి తెలిసెను. కాన లక్ష్మీబాయికి బతి వియోగ దు:ఖమునకు దోడు రాజ్యవియోగవ్యసనము సంప్రాప్తమాయెను. దొరతనము వారా రాజ్యమును తాము స్వాధీనపరుచుకొని పశ్చిమోత్తర పరగణా గవర్నరుగారి కచటి రాజ్యము నడుప ననుజ్ఞ యిచ్చిరి. వారు రాజ్యము స్వాధినపరుచుకొని రాజ్యమునకును రాజకుటుంబమునకు నిట్లు కట్టుబాట్లు చేసిరి.

గ్రామమునందున్న రాజభవనము రాణిగారి కుండుటకుగా నిచ్చి, కిల్లా తాము తీసికొనిరి. రాణిగారికి నిలువ ధనములోన గొంత యిచ్చి, మిగిలిన సంస్థానమునందలి నగలు మొదలగు ధనమంతయు దత్తపుత్రునకు మైనారిటీ తీరినవెనుక నిచ్చుటకుగాను తమయొద్దనే దాచిరి. రాణిగారు జీవించి యుండునంతవరకు (5000) అయిదువేల రూపాయలామెకు నెల వేతనముగా నేర్పరచి యంతవరకును ఆమెపైగాని, యామె యితర భృత్యవర్గముపైని గాని తమ చట్టములు నడువగూడదనియు వ్రాసియిచ్చిరి.

అందుకు ముందున్న రాణిగారి సైనికులకు విశ్రాంతి గలుగ జేసి వారికి బదులుగా దమసేన నుంచిరి.

రాణిగారికి అయిదువేలరూపాయల వేతన మిత్తుమని దొరతనమువారు వ్రాయుటయేగాని తన రాజ్యము తనకు దొరకవలయునన్న యుత్కటేచ్ఛగల రాణిగారా యల్పజీతమును మరణపర్యంతమును స్వీకరించినవారు కారు. అంత నూర