పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టకు దనకుగల ముఖ్యోద్దేశములను దద్గ్రంధముయొక్క యుపోద్ఘాతములో నీమె మూడుభాగములుగా విభజించి వ్రాసినది. వానిని సంగ్రహముగా నిట బేర్కొనియెద. 1. సామాన్యముగా స్త్రీలకు మందబుద్ధి, సహజభీరుత్వము మున్నగు నీచగుణముల నారోపించెడివారి యారోపణములు పక్షపాత జన్యములనియు, స్త్రీలు గాంభీర్యము, సూక్ష్మబద్ధ మున్ను గాగల సుగుణములను సహజముగా గలవారనియు నుదాహరణ పూర్వకముగా స్థాపించుట. 2. స్త్రీలు చదువుకొనుటవలన ననేకదుర్గుణములను బొందుదురనెడివారి వాదము శశవిషాణ న్యాయమును బోలుననియు, స్త్రీలు విద్యావతులైన యెడల ననేకములగు లాభములను బొందుటయే యప్రతిహతమైన సత్యమనియు రూడిపరచుట. 3. తన సోదరీలోకమునకు సుబోధకమును సన్మార్గబోధకమును జ్ఞానగాయకంబునుగా నేదేని యొక గ్రంథమును రచించి యొసగుట. ఇంత స్వజాత్యాభిమాన మీమె హృద్వీధిని బ్రవహించుచున్నది. గనుకనే తారచించిన రత్నమాలలో నవకాశము చిక్కినపు డెల్ల దన స్వజాతిపై మోపబడిన నిందలను దన సహజ క్షమను వదలి శూరరీతిని ఖండించు వచ్చినది. ఇట్టి స్వజాత్యభిమాన మాననీయ నింతలో దైవము గొని పోవుటకీ స్త్రీలోక మెంత మందభాగ్యము కలదో కదా!

రెండుపన్యాసములు, నొక యల్లమ్మకధ, యొక పుల్లమ్మకధ చదువుపాటి వారైనంతనే పెద్దవారందరు నేమియు దెలియని మూర్ఖపిశాచులనియు నితరులందరు దమపాటివారు కారనియు విర్రవీగెడు నిప్పటి కొందరివలెగాక యీ సాధ్వి తల్లిగారు మొదలైన పెద్దలకును దోడివారలకును నెప్పుడు గడు గూర్చుచుండెడిది. వీరి కుటుంబము పూజానీయమగు నార్యమతము నందత్యంతాభిమానముకలది. అచ్చమాంబగా తీరిక సమయములందు బూజనీయములగు భారత, భాగవత, రామాయణాది గ్రంథములును, విజ్ఞానప్రదంబులగు తత్వసంబంధములగు గ్రంథములును శ్రద్ధగా జదివి తల్లి మొదలైన పెద్దలకు జెప్పుచుండెడిది. అచ్చమాంబగారు తన ప్రాణమునకంటె నధికముగా జూచు కొనుచున్న తన సవతికూతురు దైవవశమున భర్తను కోలుపోగా నామెకు దత్పరతతో బావన బ్రహ్మచర్యమును బోధించి జ్ఞానాభివృద్ధియు విద్యాభివృద్ధియు జక్కగ గలుగ జేసినది. ఈమె 1908 సం|| కుటుంబ సహితముగ